Header Banner

వ్యవసాయం - వాతావరణ మార్పులు - వలసలకు ఉన్న సంబంధంపై విశ్లేషణ! గల్ఫ్ కార్మికుల పునరావాసంపై..

  Mon Feb 17, 2025 12:11        Gulf News

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. గురువారం సిరికొండ మండలం న్యావనందిలో గల్ఫ్ వలస నిపుణుల బృందంతో ముచ్చటించారు. గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణ గురించి వలస కార్మిక నిపుణులు డా. సిస్టర్ లిజీ జోసెఫ్, మంద భీంరెడ్డి, చేగంటి మోహన్ ల బృందం నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది. 

తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలలో వాతావరణ మార్పుల (క్లయిమేట్ చేంజ్) పరిస్థితులను తట్టుకునే విధంగా వలసదారులు, దుర్భలమైన (హాని పొందడానికి అవకాశం వున్న) కుటుంబాల స్థితిస్థాపకత (రెజిలియెన్స్) ను మెరుగుపరచడం కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేశాయి.  

నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన దర్పల్లి మండలం దుబ్బాక, హొన్నాజీపేట గ్రామాలను, సిరికొండ మండలం మైలారం, న్యావనంది గ్రామాలను సందర్శించిన బృందం ఆయా పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులను కలుసుకున్నారు. అనిశ్చిత వర్షపాతం, వరదలు, కరువులు తదితర వాతావరణ కారణాల వలన ప్రజలు తరచుగా వలస వెళ్లాల్సి వస్తున్న విషయంపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది.  

 

ఇది కూడా చదవండి: ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! వారి వివరాలు అడిగి తెలుసుకొని పేరుపేరునా ఒక్కొక్కరితో..

 

ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ (ఎఫ్ఏఓ), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) లు మైగ్రేషన్ మల్టీ-పార్ట్‌నర్ ట్రస్ట్ ఫండ్ (ఎంఎంపిటిఎఫ్) మద్దతుతో రెండు సంవత్సరాల కార్యక్రమం (ప్రాజెక్టు) ను అమలు చేయాలని సంకల్పించారు.   

 

ప్రాజెక్ట్ లక్ష్యాలు:  

వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయంపై స్థానిక సామర్థ్యాలను నిర్మించడం, దానికోసం పెట్టుబడి పెట్టడం. వలస మద్దతు సేవలను బలోపేతం చేయడం. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారిని సమీకరించడం, పునరేకీకరణ చేయడం. గల్ఫ్ కార్మికులు పంపిన డబ్బును సక్రమంగా వినియోగించే విధంగా (ఛానెలింగ్) చేయడం. స్థిరమైన జీవనోపాధికి గ్రామీణ యువతకు తోడ్పాటు అందించడం. లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం కృషి చేయడం. రక్షిత, సక్రమ, క్రమబద్ద వలసలు (సేఫ్, ఆర్డర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్) ఉండే విధంగా కృషి చేయడం. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందడం. 

 

ముఖ్య లబ్ధిదారులు:

మహిళలు రైతులుగా, వలస కుటుంబాల సభ్యులుగా లబ్ది పొందడం. యువజన సంఘాలు.  చిన్న, సన్నకారు రైతులు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు. స్వయం సహాయక బృందాలు. తిరిగి వచ్చిన వలసదారులు. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Gulf #GulfNews #Kuwait #KuwaitNews #GulfCountries #JewelleryFair #KuwaitJewelleryFair #TradeFairInKuwait #JewelleryFairResumed #TradeFairExtended